టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి పదవికి ఎల్.రమణ రాజీనామా
- July 09, 2021
హైదరాబాద్: టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పదవికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖ పంపారు.నిన్న ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధినేత,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లిన ఎల్.రమణ పార్టీ మారడంపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలని తుది నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.రమణ నేటితో టీడీపీలో తన ప్రస్థానాన్ని ముగించారు.
టీఆర్ఎస్‌లో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు రమణ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, టీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని నిన్న ఎల్.రమణకు కేసీఆర్ హామీ ఇచ్చారు.
దీంతో ఆ పార్టీలో చేరేందుకు రమణ అంగీకరించారు.త్వరలోనే టీఆర్ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి కీలక నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఎల్.రమణ వంటి నాయకుల అసవరం ఉందని భావించిన టీఆర్ఎస్ ఆయనను పార్టీలో చేర్చుకుంటోంది. టీఆర్ఎస్‌లో చేరి బీసీల కోసం కృషి చేయాలని ఆయనకు కేసీఆర్ సూచనలు చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







