వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఉద్యోగం గోవిందా

- July 09, 2021 , by Maagulf
వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఉద్యోగం గోవిందా

ఫిజి: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలి అంటే ఎకైక మార్గం వ్యాక్సిన్ ఒక్క‌టే.వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచంలోని అన్ని దేశాలు త‌మ‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను దిగుమ‌తి చేసుకొని ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నాయి.అయితే, మొద‌టి వేవ్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్న దేశాలు, డెల్టావేరియంట్ కార‌ణంగా సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి.సెకండ్ వేవ్ తీవ్ర‌త అధికంగా ఉంటుండ‌టంతో దేశాలు లాక్‌డౌన్‌ను, వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి.ఏప్రిల్ వ‌ర‌కు ఫిజీ దేశంలో కంట్రోల్ ఉన్న క‌రోనా,డెల్టావేరియంట్ కార‌ణంగా కేసులు పెర‌గ‌డం మొద‌లుపెట్టాయి.  

దీంతో అక్క‌డ ప‌రిస్థితులు ఆందోళ‌నక‌రంగా మారిపోయాయి.క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధం అయింది.ఆగ‌స్టు 15 నాటికి దేశంలోని ప్ర‌భుత్వం ఉద్యోగులంతా మొద‌టిడోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, లేదంటే ఉద్యోగులు సెల‌వుల‌పై వెళ్లాల్సి వ‌స్తుంద‌ని, న‌వంబ‌ర్ 1వ తేదీ వర‌కు సెకండో డోస్ తీసుకోకుంటే ఉద్యోగాలు కోల్పోవ‌ల‌సి వ‌స్తుంద‌ని ఫిజీ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.ఇక ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఆగ‌స్టు 1 వ‌ర‌కు మొద‌టి డోసు వ్యాక్సిన్ తీసుకోకుంటే భారీ జ‌రిమానాలు విధిస్తామ‌ని ఫిజీ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com