ఎక్స్‌పో 2020లో పాల్గొనేందుకు సర్వసన్నద్ధమవుతున్న ఇండియా
- July 09, 2021
దుబాయ్: అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఎక్స్‌పో 2020లో పాల్గొనేందుకోసం భారతదేశం తరఫున సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు హై లెవల్ ఇండియన్ డెలిగేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ అడిషనల్ సెక్రెటరీ, కమిషనర్ జనరల్ ఫర్ ఇండియా ఎస్.కిషోర్ అలాగే యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్, యూఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ మరియు డైరెక్టర్ జనరల్ ఎక్స్‌పో 2020 రీమ్ అల్ హాసిమితో సమావేశమయ్యారు. దుబాయ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి, ఫిక్కి సెక్రెటరీ జనరల్ దిలీప్ చినోయ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూఏఈ - భారతదేశం మధ్య ప్రత్యేక అనుబంధం, సన్నిహిత సంబంధాల గురించి ఈ సందర్భంగా రీమ్ అల్ హాషిమి ప్రసతావించారు. ఎక్స్‌పో 2020 కోసం భారతదేశం తరఫున జరుగుతున్న ప్రయత్నాల్ని కొనియాడారు. మరోపక్క, రాయబారి కపూర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ విషయమై యూఏఈ చూపుతున్న చొరవని అభినందించారు. ఇండియా నుంచి యూఏఈకి వచ్చే పౌరులకు సంబంధించి నిబంధనల్ని సడలించాలని కపూర్ కోరారు. యూఏఈకి చెందిన అల్హోసన్ యాప్ అలాగే భారతదేశానికి చెందిన కోవిన్ యాప్ మధ్య ఇంటర్ ఆపరేటబిలిటీపైనా చర్చ జరిగింది. ఇండియన్ పెవిలియన్ 8736 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమవుతోంది. 2019 ఆగస్టు నుంచి ఈ నిర్మాణం జరుగుతోంది. ఇంటీరియర్ వర్క్ వేగంగా సాగుతోంది. ఆగస్ట్ చివరి నాటికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోతాయి. కాగా, డెలిగేషన్.. భారతీయ వ్యాపారవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశమైంది. గడచిన 75 ఏళ్ళలో భారతదేశం సాధించిన ప్రగతిని ఇండియన్ పెవిలియన్ ద్వారా ప్రపంచానికి తెలియజేయనున్నారు.

తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







