తన తొలి బాలీవుడ్ సినిమా 'లాల్‌సింగ్ చద్దా'లో జాయిన్ అయిన నాగచైతన్య
- July 09, 2021
హైదారాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'తో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటింటిస్తూ లోకేషన్ ఫోటోను షేర్ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో అమిర్ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ కలసిఉన్నారు. అమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'ఫారెస్ట్‌గంప్' చిత్రానికి హిందీ రీమేక్‌గా 'లాల్‌సింగ్ చద్దా' తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతుంది.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







