దోఫర్ గవర్నరేట్‌లో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- July 10, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దోఫర్ గవర్నరేట్లోకి వెళ్లేందుకు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది ఒమన్ ప్రభుత్వం. దోఫర్ గవర్నరేట్లోకి వచ్చే వాళ్లు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోని వారికి అనుమతి నిషేధం. ఒమన్ జారీ చేసిన నోటీస్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచే కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఒమన్ ప్రభుత్వం ఈ మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అంతేకాదు...దోఫర్ గవర్నరేట్ పరిధిలోని హోటల్స్ , ఫర్నష్డ్ అపార్ట్మెంట్ల పూర్తి సామర్ధ్యంలో 50 శాతం మందికి మించికుండా అనుమతించాలని సూచించింది. ఇతర సంస్థలన్ని ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







