దోఫర్ గవర్నరేట్లో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ

- July 10, 2021 , by Maagulf
దోఫర్ గవర్నరేట్లో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ

ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దోఫర్ గవర్నరేట్లోకి వెళ్లేందుకు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది ఒమన్ ప్రభుత్వం. దోఫర్ గవర్నరేట్లోకి వచ్చే వాళ్లు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోని వారికి అనుమతి నిషేధం. ఒమన్ జారీ చేసిన నోటీస్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచే కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఒమన్ ప్రభుత్వం ఈ మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అంతేకాదు...దోఫర్ గవర్నరేట్ పరిధిలోని హోటల్స్ , ఫర్నష్డ్ అపార్ట్మెంట్ల పూర్తి సామర్ధ్యంలో 50 శాతం మందికి మించికుండా అనుమతించాలని సూచించింది. ఇతర సంస్థలన్ని ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com