ముగిసిన హజ్ యాత్రికుల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

- July 10, 2021 , by Maagulf
ముగిసిన హజ్ యాత్రికుల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

సౌదీ: ఈ ఏడాది హజ్ యాత్రికుల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 13 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలవగా..కోవిడ్ నేపథ్యంలో 60,000 మందికే అనుమతిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ముందస్తుగానే ప్రకటించింది. అది కూడా కింగ్డమ్ లో ఉంటున్న పౌరులు, ప్రవాసీయులకే ఈ ఏడాది అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు 60,000 అనుమతులు పూర్తి కావటంతో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 5,58,270 మంది భక్తులు హజ్ యాత్ర అనుమతుల కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. గత ఐదేళ్లలో హజ్ యాత్రకు నోచుకోని వారిని, అందులోనూ వయసు ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ 60,000 మందికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. హజ్ పర్మిట్ పొందిన వాళ్లంతా ఎలాంటి బుకింగ్ లేకుండానే సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే హజ్ యాత్రకు అనుమతి పొందిన వారు ధుల్ హిజ్జా 7, 8వ రోజున రిసీవ్ చేసుకునేందుకు నాలుగు రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వారిని ప్రత్యేక బస్సుల్లో పవిత్ర ప్రార్ధాన ప్రాంగణం మక్కాకు చేరవేస్తారు. ఇదిలాఉంటే కోవిడ్ నేపథ్యంలో హజ్ యాత్రికుల ఆరోగ్య భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com