రేపు, ఎల్లుండి ఒమన్ సుల్తాన్ సౌదీ పర్యటన
- July 10, 2021
ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ రేపు, ఎల్లుండి(జులై 11, 12) సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. సౌదీ రాజు సల్మాన్ అహ్వానం మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. ఈ పర్యటన సందర్భంగా దేశాధినేతలు సమావేశమై..రెండు దేశాల చారిత్రక సంబంధాల బలోపేతంపై చర్చించే అవకాశాలున్నాయి. అలాగే సౌదీ, ఒమనీ దేశాల అభివృద్ధికి వివిధ రంగాల్లో పరస్పర సహకారం, ఇరు దేశాల పౌరుల ప్రయోజనాలను పరిరక్షించేలా అవలంభించాల్సిన దౌత్య విధానాలపై కూడా చర్చించే ఆస్కారం ఉంది. ఇదిలాఉంటే 2020 జనవరిలో ఒమన్ సుల్తాన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైతం బిన్ తారిఖ్ తొలి విదేశీ పర్యటన ఇదే కావటం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







