త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ పొడిగింపు

- July 10, 2021 , by Maagulf
త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ పొడిగింపు

చెన్నై: క‌రోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 19 వ‌ర‌కూ లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు కొంత‌మేర స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. షాపులు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ తెరిచిఉంచేందుకు అనుమ‌తించింది. రెస్టారెంట్ల‌ను యాభై శాతం సీటింగ్ సామ‌ర్ధ్యంతో ఓపెన్ చేసే వెసులుబాటు క‌ల్పించింది. పుదుచ్చేరికి బ‌స్ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించింది.

ఇక త‌మిళ‌నాడులో తాజాగా 3,039 క‌రోనా కేసులు వెలుగుచూడ‌గా, గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి 69 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 25.13 ల‌క్ష‌ల‌కు చేర‌గా మ‌ర‌ణాల సంఖ్య 33,322కి పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com