క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన: 230 మంది అరెస్ట్
- July 10, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ఈస్టర్న్ ప్రావిన్సులో 238 మంది వ్యక్తుల్ని ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఈ ప్రాంత పోలీసు అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ బిన్ షార్ అల్ షెహ్రి వెల్లడించారు. సెక్యూరిటీ అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపుతున్నట్ల చెప్పారు. నిందితులపై ప్రాథమిక విచారణ అనంతరం, తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్ కి అప్పగించడం జరిగింది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే 200,000 సౌదీ రియాల్స్ వరకు అత్యధికంగా జరీమానా విధించే అవకాశం వుంది. రెండేళ్ళ వరకు జైలు శిక్ష కూడా విధించొచ్చు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే జరీమానా, జైలు శిక్ష రెండింతలయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







