సల్మానియా ఆసుపత్రిలో యాక్సిడెంట్ మరియు ఎమర్జన్సీ విభాగాలు, క్లినిక్స్ విస్తరణ
- July 10, 2021
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్, యాక్సిడెంట్ మరియు ఎమర్జన్సీ విభాగం విస్తరణకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఏడాదికి 66,000 మందికి వైద్య చికిత్స అందించేలా ఈ విభాగాన్ని విస్తరించనున్నారు. ఈ మేరకు టెండర్ కూడా విడుదల చేశారు. పీడియాట్రిక్స్ అలాగే పెద్దల విభాగాలకు సంబంధించి అదనపు గదుల్ని ఏర్పాటు చేయనున్నారు విస్తరణలో భాగంగా. 500 బహ్రెయినీ దినార్ల బాండుతో టెండర్ ప్రక్రియలో పాల్గొనాలి. ఆగస్ట్ 4వ తేదీతో టెండర్ వేసేందుకు ఆఖరు తేది. మార్చి 2021లో జారీ చేసిన టెండర్ కోసం 119,345,260 నుంచి 99,500,000 బహ్రెయినీ దినార్ల మధ్య కొన్ని టెండర్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరిలో దాఖలు చేసిన టెండర్ విషయానికొస్తే, 12 మందికాంట్రాక్టర్లు పాల్గొన్నారు.169,158,200 నుంచి 419,633,550 మధ్య టెండర్లు పడ్డాయి. 2020లో మొత్తంగా నాలుగు టెండర్లను సల్మానియా మెడికల్ కాంప్లెక్సుకి సంబంధించి జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







