రూ.2500 కోట్ల భారీ డ్రగ్స్ పట్టివేత..

- July 10, 2021 , by Maagulf
రూ.2500 కోట్ల భారీ డ్రగ్స్ పట్టివేత..

న్యూ ఢిల్లీ: దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. దేశంలోని యువత ముఖ్యంగా డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు పలు సర్వేలు సైతం కుండబద్దలు కొట్టాయి. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమరవాణా ఎక్కువ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాక్ బోర్డర్ నుంచి అధికంగా పంజాబ్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాపై దృష్టి సారించిన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పకడ్భందీ చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూలేనంతగా భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2500 కోట్ల విలువ చేసే 350కిలలో హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com