సల్మానియా ఆసుపత్రిలో యాక్సిడెంట్ మరియు ఎమర్జన్సీ విభాగాలు, క్లినిక్స్ విస్తరణ

- July 10, 2021 , by Maagulf
సల్మానియా ఆసుపత్రిలో యాక్సిడెంట్ మరియు ఎమర్జన్సీ విభాగాలు, క్లినిక్స్ విస్తరణ

బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్, యాక్సిడెంట్ మరియు ఎమర్జన్సీ విభాగం విస్తరణకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఏడాదికి 66,000 మందికి వైద్య చికిత్స అందించేలా ఈ విభాగాన్ని విస్తరించనున్నారు. ఈ మేరకు టెండర్ కూడా విడుదల చేశారు. పీడియాట్రిక్స్ అలాగే పెద్దల విభాగాలకు సంబంధించి అదనపు గదుల్ని ఏర్పాటు చేయనున్నారు విస్తరణలో భాగంగా. 500 బహ్రెయినీ దినార్ల బాండుతో టెండర్ ప్రక్రియలో పాల్గొనాలి. ఆగస్ట్ 4వ తేదీతో టెండర్ వేసేందుకు ఆఖరు తేది. మార్చి 2021లో జారీ చేసిన టెండర్ కోసం 119,345,260 నుంచి 99,500,000 బహ్రెయినీ దినార్ల మధ్య కొన్ని టెండర్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరిలో దాఖలు చేసిన టెండర్ విషయానికొస్తే, 12 మందికాంట్రాక్టర్లు పాల్గొన్నారు.169,158,200 నుంచి 419,633,550 మధ్య టెండర్లు పడ్డాయి. 2020లో మొత్తంగా నాలుగు టెండర్లను సల్మానియా మెడికల్ కాంప్లెక్సుకి సంబంధించి జారీ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com