200ML కంటే తక్కువ పరిమాణం ఉన్న వాటర్ బాటిల్స్ బ్యాన్

- July 11, 2021 , by Maagulf
200ML కంటే తక్కువ పరిమాణం ఉన్న వాటర్ బాటిల్స్ బ్యాన్

బహ్రెయిన్: వాటర్ బాటిల్స్ అమ్మకాలపై బహ్రెయిన్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా ఇక నుంచి 200 మిల్లీ లీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే వాటర్ బ్యాటిల్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 200 మిల్లీ లీటర్ల కంటే తక్కువగా ఉండే వాటర్ బాటిల్స్ తయారీ, దిగుమతి, అమ్మకాలు జరపొద్దని ఆదేశించింది. ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి 6 నెలల వరకు నిషేధం అమలులో ఉంటుందని పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని కార్యదర్శి హోదా అధికారులు పకడ్బందీగా నిషేధం అమలు అయ్యేలా పర్యవేక్షిస్తారు. అయితే...దేశీయంగా అమ్మకాలపై నిషేధం ఉన్నా..ఎగుమతి చేసేందుకు మాత్రం అనుమతిస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com