కోవిషీల్డ్ కువైట్‌లోనూ ఆమోదం పొందిన వ్యాక్సిన్: భారత రాయబారి

- July 11, 2021 , by Maagulf
కోవిషీల్డ్ కువైట్‌లోనూ ఆమోదం పొందిన వ్యాక్సిన్: భారత రాయబారి

కువైట్: భారత్‌లో కోవిషీల్డ్ పేరిట ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ అస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ కువైట్‌లోనూ ఆమోదం పొందిందని భారత రాయబారి సిబి జార్జ్ స్పష్టం చేశారు. తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడిన రాయబారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను భారత్‌లో సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను కువైట్‌కు భారత్ పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేగాక భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీగా పరిగణిస్తారని, వ్యాక్సిన్ల తయారీలోనూ అతిపెద్దదని రాయబారి చెప్పుకొచ్చారు. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు తిరిగి కువైట్ వచ్చేందుకు తమ పేర్లను ఆరోగ్యశాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని గత నెలలోనే ఆయన సూచించారు.    

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com