స్కూళ్లను తెరిచే క్రమంలో ఈ ఆప్షన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- July 11, 2021
కువైట్: వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించాలి అన్న విద్యా మంత్రిత్వ శాఖ ప్రణాళికను పార్లమెంటరీ విద్యా కమిటీ ఈ రోజు తన సమావేశంలో చర్చించింది. మరలా ఈద్-అల్-అధా తరువాత సంబంధిత పార్టీలతో చర్యల తీరును నిర్ణయించడానికి వివరణాత్మక సమావేశం జరుగుతుంది.
పాఠశాలలను ప్రారంభించడంలో మూడు ఆప్షన్లను నేడు జరిగిన సమావేశంలో పరిశీలించినట్టు తెలుస్తోంది.
మొదటి ఆప్షన్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఆఫ్లైన్ పాఠశాల ప్రారంభించడం. అయితే, ఈ ఆప్షన్ లో ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్య 50 శాతానికి మించకూడదని కమిటీ చర్చించింది.
రెండవ ఆప్షన్: హైబ్రిడ్ విద్యాబోధన - ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విద్యను మిళితం చేస్తుంది.
మూడవ ఆప్షన్: ఆన్లైన్ విద్యతో కొనసాగడం.
వీటిపై మరింత లోతైన పరిశీలన జరిపేందుకు ఆరోగ్య, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్, మానవ వనరుల శాఖలతో ఈద్ సెలవుల తరువాత సమావేశం జరిపి ఒక నిర్ణయానికి వస్తాం అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







