స్కూళ్లను తెరిచే క్రమంలో ఈ ఆప్షన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం

- July 11, 2021 , by Maagulf
స్కూళ్లను తెరిచే క్రమంలో ఈ ఆప్షన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం

కువైట్: వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించాలి అన్న విద్యా మంత్రిత్వ శాఖ ప్రణాళికను పార్లమెంటరీ విద్యా కమిటీ ఈ రోజు తన సమావేశంలో చర్చించింది. మరలా ఈద్-అల్-అధా తరువాత సంబంధిత పార్టీలతో చర్యల తీరును నిర్ణయించడానికి వివరణాత్మక సమావేశం జరుగుతుంది.

పాఠశాలలను ప్రారంభించడంలో మూడు ఆప్షన్లను నేడు జరిగిన సమావేశంలో పరిశీలించినట్టు తెలుస్తోంది.

మొదటి ఆప్షన్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఆఫ్‌లైన్ పాఠశాల ప్రారంభించడం. అయితే, ఈ ఆప్షన్ లో ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్య 50 శాతానికి మించకూడదని కమిటీ చర్చించింది.
రెండవ ఆప్షన్: హైబ్రిడ్ విద్యాబోధన - ఇది ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ విద్యను మిళితం చేస్తుంది.
మూడవ ఆప్షన్: ఆన్‌లైన్ విద్యతో కొనసాగడం.

వీటిపై మరింత లోతైన పరిశీలన జరిపేందుకు ఆరోగ్య, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్, మానవ వనరుల శాఖలతో ఈద్ సెలవుల తరువాత సమావేశం జరిపి ఒక నిర్ణయానికి వస్తాం అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com