టీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ
- July 12, 2021
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు.ఈ రోజు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్.రమణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ..టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు సభ్యత్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఎల్.రమణతో పాటు పలు సంఘాల నేతలు, ఆయన మద్దతుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మారడంపై ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల రమణ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.రమణ ఆ పార్టీలో తన ప్రస్థానాన్ని ముగించారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







