కాఫీ బ్యాగ్స్‌లో హాషిష్ స్మగ్లింగ్: బహ్రెయినీ అరెస్ట్

- July 12, 2021 , by Maagulf
కాఫీ బ్యాగ్స్‌లో హాషిష్ స్మగ్లింగ్: బహ్రెయినీ అరెస్ట్

బహ్రెయిన్: బహ్రెయినీ జాతీయుడొకరు ఐదు కిలోగ్రాముల హాషిష్‌ని కింగ్ ఫవాద్ కాజ్‌వే ద్వారా స్మగుల్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 3,000  బహ్రెయినీ దినార్ల మొత్తానికి ఆశపడి నిందితుడు ఈ పని చేసినట్లుగా అధికారులు తేల్చారు. కాఫీ బ్యాగ్స్ ద్వారా హాషిష్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు, అత్యంత చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని సమాచారంతో, ఎవరికైతే ఆ హాషిష్ చేరాల్సి వుందో అతన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com