రెసిడెన్సీ వీసా ఉల్లంఘునులకు హోటల్ తరహాలో సెంటర్

- July 13, 2021 , by Maagulf
రెసిడెన్సీ వీసా ఉల్లంఘునులకు హోటల్ తరహాలో సెంటర్

దుబాయ్: నివాస అనుమతుల ఉల్లంఘునుల కోసం రెసిడెన్సీ& ఫారెన్ అఫైర్స్ జనరల్ డైరెక్టరేట్..దుబాయ్ లో అత్యాధునిక వసతులను కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం స్టార్ హోటల్ రేంజ్ లో ఉండటం విశేషం. 16,731 చదరపు మీటర్ల వైశాల్యంలో పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఏర్పాట్లు చేసినట్లు GDRFA వెల్లడించింది. 2015లో సెంటర్ నిర్మాణం ప్రారంభం అవగా 2018 తొలినాటికి సిద్ధమైంది. అయితే..పాత సెంటర్ లో పురుషులు, స్త్రీలు కలిపి 500 మంది సామర్ధ్యానికే పరిమితం అవగా...కొత్త సెంటర్ 1,288 మంది సామర్ధ్యం కలిగి ఉంది. రెసిడెన్సీ వీసా నిబంధనల ఉల్లంఘునులు, వీసా గడువు ముగిసిన వారిని ఈ కేంద్రానికి తరలిస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు మినహా ఉల్లంఘునులకు గరిష్టంగా 14 రోజుల పాటు ఈ కేంద్రంలో బస కల్పిస్తారు.

సెంటర్ కు తరలించిన వీసా ఉల్లంఘునుల వస్తువులు, డబ్బులు దాచుకునేందుకు 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీసా గడువు ముగిసిన వారు దేశం విడిచి వెళ్లేలా సాయం చేసేందుకు కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. దుబాయ్ ఎయిర్ పోర్టు అనుబంధంగా పని చేసే DUBZ సెంటర్లో ఉంటున్న ఉల్లంఘునులు సొంత దేశానికి వెళ్లేలా ఆయా ఎంబసీ కార్యాలయాలతో సమన్వయం చేస్తూ దోహదపడుతుంది. కావాల్సిన డాక్యుమెంట్లు, పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ మాత్రం తప్పనిసరి. ఇక ఈ సెంటర్లో ఉంటున్న వారిని కలుసుకునేందుకు వచ్చే విజిటర్స్ కు కూడా తగిన ఏర్పాట్లు ఉన్నాయి. స్త్రీ, పరుషుల వారీగా శని, ఆదివారాల్లో విజిటింగ్ డేస్ గా నిర్ధారించారు. విజిటర్లు వెయిట్ చేసేందుకు లాంజ్ లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో నేరుగా కలుసుకోకుండా అద్దాల మధ్య నుంచి ఫోన్ లో మాట్లాడేలా ఏర్పాటు చేశారు. త్వరలోనే వర్చువల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అధికారులు.

సెంటర్లో ఉంటున్నవారు ఆనారోగ్యంతో ఉంటే తగిన వైద్య సేవలు అందించేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా చికిత్స గదులున్నాయి. ఒక్కో గదిలో మూడు బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 గంటల వరకు డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉంటారు. నర్సులు 24 గంటలపాటు సేవలు అందిస్తారు. సెంటర్లో ఉండేవారు కోరుకుంటే వెంటనే కోవిడ్ టెస్టులతో పాటు తగిన వైద్య సాయం అందిస్తారు. ఒకవేళ వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే వెంటనే దుబాయ్ హెల్త్ ఆథారిటీ ఆధ్వర్యంలోని ఆస్పత్రులకు తరలిస్తారు. ఇదిలాఉంటే..ఈ సెంటర్లో మొత్తం 14 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో 8 పురుషులకు, 6 స్త్రీలకు కేటాయించారు. ప్రతి రోజు మూడు పూటల భోజన వసతి ఉంటుంది. మానసిక ఒత్తిడి లేకుండా ప్రతి రోజు ఉదయం రెండు గంటల పాటు సెంటర్ కంట్రీయార్డ్ లో తిరిగేందుకు అనుమతిస్తారు. అలాగే స్పోర్ట్స్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ కూడా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com