హజ్ పర్మిట్ లేని వారికి రవాణా సౌకర్యం కల్పించినా జరిమానా, జైలు శిక్ష
- July 13, 2021
సౌదీ: హజ్ పర్మిట్ లేని వారికి రవాణా సౌకర్యం కల్పించినా సదరు ట్రాన్స్ పోర్ట్ వ్యక్తులకు శిక్ష తప్పదని హెచ్చరించారు పాస్ పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ (జవజత్) అధికారులు. హజ్ యాత్రికులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా హజ్ పర్మిట్ లేని వారికి రవాణా సౌకర్యం కల్పించి పట్టుబడితే 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు SR50,000 ఫైన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక పర్మిట్ లేని ప్రయాణికులు ఒకరి కంటే ఎక్కువ ఉంటే ఫైన్ రెట్టింపు అవుతుందని హెచ్చరించారు. ఒకవేళ ఏవరైనా ప్రవాసీయులు హజ్ పర్మిట్ ను ఫోర్జరీ చేసి పవిత్ర ప్రార్ధనా ప్రాంగణాల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తే వారిని దేశం నుంచి 10 ఏళ్ల పాటు బహిష్కరిస్తామన్నారు. నిషేధం ఎదుర్కొనే ప్రవాసీయులు కేవలం హజ్, ఉమ్రా యాత్రలకు తప్ప వర్క్ పర్మిట్లు జారీ చేయబోమని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది కింగ్డమ్ లో ఉన్న 60,000 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. హజ్ పర్మిట్ లేకుండా గ్రాండ్ మసీదు, మక్కాలోని సెంట్రల్ హరామ్ ఏరియాతోపాటు మినా, ముజ్దలిఫా, అరాఫత్ లోని పవిత్ర ప్రార్ధానా ప్రాంగణాల్లోకి ప్రవేశించిన వారిపై SR10,000 జరిమానా విధించినట్లు ఇప్పటికే హెచ్చరించింది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







