COVID19: పిల్లల యాక్టివిటీలకు బ్రేక్!

- July 13, 2021 , by Maagulf
COVID19: పిల్లల యాక్టివిటీలకు బ్రేక్!

కువైట్: కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో పిల్లలను సంరక్షించేందుకు గాను కాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. జులై 25 నుండి తదుపరి ఆదేశాల వరకు పిల్లల యాక్టివిటీలు అనగా వేసవి క్లబ్‌లు, స్విమ్మింగ్ క్లాసులు, ఆటపాటల క్లాసులు మొదలైనవాటిని మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కెపిసి) కు అనుసంధానమైన హాస్పిటల్స్ ను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఉంచాలని కేబినెట్ ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com