తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి జరిమానా విధించిన హైకోర్టు..
- July 13, 2021
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల తన లగ్జరీ కారు దిగుమతి చేసుకున్నందుకు పన్ను మినహాయింపు కోరుతూ… పిటిషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు స్టార్ హీరోలు పన్ను చెల్లించేందుకు వెనుకాడుతున్నారని.. హైకోర్టు వ్యాఖ్యనించింది.
తమిళ్ స్టార్ విజయ్ దళపతికి కార్లు అంటే అమితమైన ఇష్టం. పాత కాలపు వాహనాలతోపాటు.. బీఎమ్‌డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు విజయ్ దగ్గర ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు విజయ్. అయితే ఈ కారును దిగుమతి చేసుకున్నందుకు గానూ… పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే కారుకు పన్ను కట్టనందుకు రూ. లక్ష జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







