ఏపీ కరోనా అప్డేట్
- July 13, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,763 శాంపిల్స్ పరీక్షించగా.. 2,567 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.తాజా మృతుల్లో గుంటూరులో నలుగురు, చిత్తూరు,నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇక, ఇదే సమయంలో 3,034 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 2,31,30,708 శాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులతో కలుపుకొని పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,988కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 18,87,236కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,042 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







