‘రాక్షసుడు’ సీక్వెల్..అయితే మన బెల్లంకొండ కాదా??!!
- July 14, 2021
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రానికి ‘రాక్షసుడు-2’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్నది. ఈ సీక్వెల్‌కు రమేష్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ ఉపశీర్షిక. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రమిది. తొలి భాగానికి మించి ఉత్కంఠను పంచుతుంది. అగ్ర కథానాయకుడు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







