అదిరిపోయిన ‘నారప్ప’ ట్రైలర్
- July 14, 2021
అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ఎన్నో రోజుల సంగ్ధిదత తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం ‘నారప్ప’ ట్రైలర్‌ను నెట్టింట్లో విడుదల చేసింది. భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేశ్ నటన ప్రతిఒక్కరితో చప్పట్లు కొట్టించేలా ఉంది. ఆయన చెప్పిన డైలాగులు ఈలలు వేయించేలా ఉన్నాయి.
తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అసురన్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కుల వ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ధనుష్ నటించిన ‘అసురన్’ ప్రేక్షకులు, ప్రముఖుల నుంచే కాకుండా విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. కాగా, తెలుగు నేటివిటీకి తగిన విధంగా ‘అసురన్’లో కొన్ని మార్పులు చేసి ‘నారప్ప’ తెరకెక్కించారు. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు. సురేశ్ ప్రొడెక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fight for what is YOURS… at the right time!#NarappaTrailer out now: https://t.co/KFYzLXugzY
— Venkatesh Daggubati (@VenkyMama) July 14, 2021
Meet #NarappaOnPrime, July 20. @PrimeVideoIN#Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/cWlmQMbXc1
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







