ఖతార్ డ్యూటీ ఫ్రీ: కొత్తగా 21 షాపింగ్ మరియు డైనింగ్ ఔట్‌లెట్స్ ప్రారంభం
- July 15, 2021
దోహా: ఖతార్ డ్యూటీ ఫ్రీ (క్యుడిఎఫ్), 21వ యానివర్సరీ నేపథ్యంలో 21 కొత్త షాపింగ్ మరియు డైనింగ్ ఔట్‌లెట్లను ప్రారంభించనుంది. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వున్న కేంద్రాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వీటిని ఏర్పాటు చేస్తారు. కొత్త ఔట్‌లెట్స్ డిపాచ్యుర్ మరియు అరైవల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్ బ్రాండ్లు, ట్రావెల్ ఎషెన్ససియల్ స్టోర్స్, బిగ్ వాల్యూ వంటి సౌకర్యాలు ఇక్కడ పొందవచ్చు. ఖతార్ ఎయిర్ వేస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బాకర్ మాట్లాడుతూ, అత్యద్భుతమైన రిటైల్ మరియు డైనింగ్ అనుభవం ప్రయాణీకులకు అందించడమే లక్ష్యంగా తమ సేవల్ని మరింత మెరుగ్గా మలచుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో మూడో అత్యద్భుతమైన విమానాశ్రయం అలాగే, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మొట్టమొదటి అత్యద్భుత విమానాశ్రయంగా హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన ఉనికిని చాటుకుంటోంది. చవులూరించే ప్రపంచ స్థాయి వంటకాలతో కూడిన డైనింగ్, ప్రపంచంలో మేటి సౌందర్య ఉత్పత్తులు ఈ స్టోర్లలో ప్రత్యేకం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







