టీమిండియాలో కరోనా వైరస్ కలకలం..

- July 15, 2021 , by Maagulf
టీమిండియాలో కరోనా వైరస్ కలకలం..

లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా దుమారం రేపుతోంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు వైరస్ బారిన పడినట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలోని కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాలో కరోనా దుమారం రేపుతోంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు వైరస్ బారిన పడినట్లు సమాచారం. కొవిడ్ సోకిన వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ సోకిన ప్లేయర్లు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. మిగతా ఆటగాళ్లందరూ డర్హమ్‌లో ఏర్పాటు చేసిన బయో‌బబుల్‌లోకి ప్రవేశించారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇక ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం తొలుత ఇద్దరికి కరోనా సోకింది. వారిలో ఒకరికి పూర్తిగా తగ్గిందని పేర్కొంది. మరోకరికి ఆదివారం మరోసారి కొవిడ్ టెస్ట్ చేయనున్నట్లు చెప్పింది. అయితే కొవిడ్ బారిన పడిన వారికి లక్షణాలు లేవని, కొద్దిగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని టీమ్ యాజమాన్యం పేర్కొంది. బయో బబుల్ నిబంధనలను కఠినంగా పాటించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండటంతో బీసీసీఐ భారత ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com