కరోనా వైరస్ హెల్త్ స్టేటస్ స్కామ్: 122 మందిపై కేసులు
- July 15, 2021
రియాద్: సౌదీ అరేబియా యాంటీ కరప్షన్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా వైరస్ హెల్త్ స్టేటస్ (పౌరులకు అలాగే నివాసితులకు) అక్రమంగా మార్చే క్రమంలో 122 మంది భాగస్వామ్యం వున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌సైట్ మరియు యాంటీ కరప్షన్ విభాగం 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఇప్పటికే వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా నిందితులు, ఈ నేరానికి పాల్పడే క్రమంలో ప్రకటనలు ఇచ్చారని అధికారులు తెలిపారు. విచారణ తర్వాత మొత్తం 122 మంది ఈ కుట్రలో భాగం పొందారని గుర్తించినట్లు అధికారులు వివరించారు. 122 మందిలో 9 మంది (ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులు కాగా, 21 మంది (ెనిమిది మంది పురుష పౌరులు, ఒక మహిళా పౌరురాలు 12 మంది వలసదారులు) ఫెసిలిటేటర్స్‌గా వ్యవహరించారు. 92 మంది లబ్దిదారులున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







