సెల్ఫోన్ డ్రైవింగ్కి 24 గంటల జైలు శిక్ష
- March 10, 2016
సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ, సెల్ఫోన్ మాట్లాడుతూ మోటర్ వెహికిల్స్ డ్రైవింగ్ చేసేవారికి 24 గంటల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. 160 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో రోడ్లపై ప్రయాణం చేస్తే, వారి లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ఈ నిబంధనల్ని ఉల్లంఘించిన 60 మందికి గత నెలలో పెనాల్టీ విధించడం జరిగింది. అతి వేగంగా వాహనాలు నడిపిన 4 గురు వ్యక్తుల లైసెన్సుల్ని కూడా రద్దు చేశారు. రేడియో ప్రోగ్రామ్ ద్వారా సెల్ఫోన్ డ్రైవింగ్ గురించీ, రెక్లెస్ డ్రైవింగ్ గురించీ అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు డెవలప్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ బాడీస్ కమిషన్ హెడ్ కల్నల్ అబుదల్ అజీజ్ అల్ లుహాయిదాన్ మాట్లాడారు. నిబంధనల్ని ఉల్లంఘించేవారికి మూడు మెసేజ్లు పంపబడ్తాయనీ, ట్రాఫిక్ ఆఫీస్ వద్ద వారు హాజరు కాని పక్షంలో, ట్రాఫిక్ సర్వీసులనుంచి వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని, అలాగే పెనాల్టీ విధించబడుతుందని ఆయన వివరించారు. ఇలాంటి సందర్భాల్లో ఆన్లైన్ ద్వారా చెల్లింపులకు ఆస్కారం లేకుండా, వ్యక్తిగతంగా హాజరై చలాన్లు చెల్లించేలా 'బ్లాకింగ్' అనే మెకానిజంని రూపొందించినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







