టీ20 ప్రపంచకప్: ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్.. గ్రూపుల వివరాలు ఇవే
- July 16, 2021
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ గ్రూపులను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాక్‌లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు బరిలో నిలిచాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈలో వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తుది షెడ్యూల్‌ను ఐసీసీ మరికొన్ని వారాల్లో ప్రకటించనుంది.ఈ పోటీలను బీసీసీఐ యూఏఈ, ఒమన్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
*ఇక టీ20 క్రికెట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న వెస్టిండీస్.. గ్రూప్-1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పోటీపనున్నాయి. *గ్రూప్-2లో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లతో తలపడనుంది. *ఈ క్రమంలోనే శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. *బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువాన్యూగినియా, ఓమన్ జట్లు గ్రూప్-బీలో చోటు సంపాదించుకున్నాయి. *ఈ ఎనిమిది జట్లలో టాప్‌లో నిలిచిన నాలుగు గ్రూప్-1, గ్రూప్-2లో చివరిస్థానాల్లో నిలుస్తాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







