దోపిడీ నేరం రుజువు కావడంతో ముగ్గురు పాకిస్తానిలకు జైలుశిక్ష
- March 10, 2016
ముగ్గురు దొంగలు ముచ్చటగా...అదనపు ఆదాయం కోసం చోరకళను ఆశ్రయించారు. ఇందుకు వారు అయిదు రోజులు రెక్కి సైతం నిర్వహించి ఈ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేద్దామనుకోన్నారు...కాని , మూలన దాగిన మూడో నేత్రం ఉహే వారికి తట్టలేదు..నమ్మకంగా ఆ కేమెర తన పని తాను చేసుకొని.... వీరిని తగిన ఆధారాలతో సహా పట్టి ఇచ్చింది... వివరాలలోనికి వెళితే, మనామా లోని ఒక ఆభరణాల దుకాణంలో ఈ ముగ్గురు దోపిడికి పాల్పడినట్లు కేసు వారిపై నమోదైంది. దీంతో నేరం సైతం రుజువు కావడంతో ఆ ముగ్గురు పాకిస్తాన్ జాతీయులకు కారాగారం ప్రాప్తించింది. వీరికి అయిదేళ్ళ జైలుశిక్ష, అనంతరం దేశ బహిష్కరణను కోర్టు విధించింది. ఆభరణాల దుకాణ యాజమానైన 55 ఏళ్ల బాధితుడు దుకాణం వెలుపలకు వస్తున్న సమయంలో ఈ ముగ్గురు దొంగలు ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి బ్యాగు లాక్కొని పారిపోయారు.అందులో 8,000 బి .డి లు ఉన్నాయి. కోర్టు పత్రాలు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి నేరస్తుడు తమ నేరాన్ని అంగీకరిస్తూ..తొలుత తాము ముగ్గురం దుకాణ యజమాని మధ్యాహ్నం వెళ కారులో ఒక ఇరుకు సందులోనికి వెళుతున్నట్లు గత అయుదు రోజులగా ఆయనను వెంట పడినట్లు ఒప్పుకొన్నాడు. ఇరుకైన సందు లో దోపిడీ చేసేందుకు ప్రణాళిక.సిద్ధం చేసుకొంటే... ఆయన అనేక మంది ఉన్న ప్రాంతాలలోనే ప్రయాణిస్తూ తమకు తారసపడుతున్నాడని దీంతో అక్కడ దొంగతనం కుదరకపోవడంతో... ప్రణాళికలో కొద్దిగా మార్పులు చేసామని తెలిపాడు. యజమాని దుకాణం నుంచి రావడమే ఆయన వద్ద నుంచి బ్యాగు లాక్కొని ఉదాయిద్దామనుకోన్నామని కాని, సి సి కెమెరాలు తమను పట్టి ఇచ్చేయని మొదటి ప్రతివాది వాపోయాడు. ఆ యజమాని అల్లే దయతో వెళ్ళిపోయే వాడని మాకిప్పుడు అర్ధమవుతుందని తెలిపాడు. ముద్దాయిలు దోచుకొన్న సొమ్మును ఇంకా వాటాలు కూడా వేసుకోకముందే తాము దోరికిపోయామని నిట్టుర్పు విడిచారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









