శ్రీకాంత్ విడుదల చేసిన ‘కళాకార్’ ఫస్ట్ లుక్ పోస్టర్
- July 17, 2021
హైదరాబాద్: ‘6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి, శంకర్‌దాదా ఎంబీబీఎస్, నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కళాకార్’. వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ”’కళాకార్’ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్ స్పెక్టర్ గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో చూస్తున్నాను. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. రోహిత్, నేను కలిసి ఎప్పటినుండో ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాం. ఆయన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. హీరో రోహిత్ మాట్లాడుతూ – ”ఫస్ట్ టైమ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్రమిది. నాది పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది” అని చెప్పారు. హీరో రోహిత్‌కు పర్‌ఫెక్ట్ రీ ఏంట్రీ సబ్జెక్ట్ ఇదని, మంచి కథ-కథనం, భారీ తారాగణంతో శ్రీను ఈ మూవీని తెరకెక్కించారని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపు దశలో ఉందని నిర్మాత వెంకటరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







