లాక్ డౌన్, కర్ఫ్యూ ఆలోచనలే లేవన్న సుప్రీం అడ్వైజరీ కమిటీ

- July 18, 2021 , by Maagulf
లాక్ డౌన్, కర్ఫ్యూ ఆలోచనలే లేవన్న సుప్రీం అడ్వైజరీ కమిటీ

కువైట్: వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన విధానాలను అవలంభిస్తామని కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం అడ్వైజరీ కమిటీ స్పష్టం చేసింది. వైరస్ విస్తృతిని అడ్డుకునే చర్యలు ప్రజల ఆర్ధిక స్థితిని దెబ్బతీయకుండా ప్రత్యామ్నాయ చర్యల దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించే ఆలోచనలు ఇప్పటికైతే లేవని తేల్చి చెప్పారు కమిటీ చీఫ్ డాక్టర్ ఖలీద్ అల్-జరల్లా. అయితే..సాధారణ నియంత్రణ మార్గదర్శకాలను మాత్రం పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. అలాగే వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తామని వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com