సౌదీ రాజుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ సుల్తాన్

- July 18, 2021 , by Maagulf
సౌదీ రాజుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ సుల్తాన్

సౌదీ రాజు కింగ్ సల్మాన్ కు ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ ఈద్ అల్ అధా శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. సౌదీ రాజుకు ఫోన్ చేసిన ఆయన..తన సౌదీ పర్యటలో లభించిన అతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలె సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ సౌదీలో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఒమన్ సుల్తాన్ గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలం తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే కావటం విశేషం. ఈ పర్యటనలోనే రెండు దేశాల మధ్య సౌదీ-ఓమన్ మండలి ఏర్పాటకు MOU కుదిరింది. తన పర్యటన సానుకూల వాతవరణంలో ఫలవంతంగా ముగియటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే సౌదీ రాజు, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి తనకు అందిన అతిథ్యం పట్ల కింగ్ సల్మాన్ కు ఫోన్లో ధన్యవాదాలు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com