చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు - ఉత్తరాఖండ్ సీఎం
- July 18, 2021
డెహ్రాడూన్: చార్‌ధామ్‌లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామని స్పష్టం చేశారు. వేదాల్లో ప్రస్తావించనందున ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగదని చెప్పారు. పరిమిత సంఖ్యలో యాత్రికులతో చార్ధామ్ యాత్రకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు. సలహాలు, సూచనలన్నీ తీసుకున్న తర్వాత ‘చార్ధామ్ యాత్రను లైవ్ ప్రసారం చేయదలచుకోలేదు. అలా చేయాలని వేదాల్లో కూడా రాసి లేదు’ అని తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది దేశం నలుమూలల నుంచి భక్తులను యాత్రకు అనుమతించిన సందర్భంలో రోజుకు 70 మంది గంగోత్రిని, 40 యమునోత్రిని, 180 మంది కేదార్‌నాథ్‌ను, 400 మంది బద్రీనాథ్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







