$198తో బహ్రెయిన్-సౌదీ కారు ప్రయాణం..కరీమ్ సంస్థ ప్రకటన
- July 20, 2021
బహ్రెయిన్ నుంచి సౌదీలోని పలు నగరాలకు కారు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కరీమ్ సంస్థ వెల్లడించింది. వినియోగదారులు బహ్రెయిన్ నుండి వన్-వే ప్రయాణం కోసం దమ్మం, ఖోబార్, ధహ్రాన్, జుబైల్, బుకాయిక్, హుఫోఫ్, రియాద్ సహా ఇతర సౌదీ నగరాలకు కారును బుక్ చేసుకోవచ్చు. ఇందుకు $198 నుండి ఛార్జీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రతీ ట్రిప్ లో కారులో ఐదుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఈ ఇంటర్ సిటీ కార్ సర్వీసులను పైలట్ ప్రాజెక్టుగా యూఏఈ-ఈజిప్టులో చేపట్టినట్లు కరీమ్ జీసీసీ జనరల్ మేనేజర్ ఖలీద్ నుసీబే తెలిపారు. తామ సంస్థ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయటంలో భాగంగా బహ్రెయిన్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగిస్తామని వివరించారు. నగరాల మధ్య సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







