జూలై 30న ‘ఇష్క్’
- July 20, 2021
హైదరాబాద్: సౌత్ ఇండియాలోని ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో ‘ఇష్క్` చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ మలయాళ రీమేక్ లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించింది.యస్.యస్. రాజు దర్శకత్వం వహించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ కారణం ఈ సినిమా విడుదల ఆ మధ్య వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి థియేటర్లను తెరుస్తుండటంతో ఈ నెల 30న మూవీని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చిన ‘ఇష్క్’కు శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్!
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







