‘105 మినిట్స్’ షూటింగ్ ప్రారంభం
- July 22, 2021హైదరాబాద్: ‘కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అయిన హన్సిక పై విధంగా ట్వీట్ చేసారు.రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ