నా ఫోన్ ట్యాప్ అయ్యింది: రాహుల్ గాంధీ
- July 23, 2021
న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు.పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నా మైబైల్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.నేను ప్రతిపక్ష నాయకుడిని..ప్రజల గళాన్ని నేను వినిపిస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ చర్య ప్రజల గళానికి వ్యతిరేకంగా జరిగిన దాడి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారని రాహుల్ గాంధీ అన్నారు.సీబీఐ డైరెక్టర్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరూకంగా పెగాసస్ వాడినట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశానికి వ్యతిరేకంగా పెగాసస్ వాడారని ఆయన ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానూ పెగాసస్ వాడారని, దేశంలోని అన్ని సంస్థలకూ వ్యతిరేకంగా దాన్ని వాడారని ఆరోపించారు.పెగాసస్ వినియోగించి రాజద్రోహానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







