వెరైటీ వెజ్ పఫ్
- July 23, 2021
పఫ్ చెయ్యటానికి కావలసిన పదార్ధాలు: గోధుమ పిండి ఒక కప్,ఆయిల్ 6 టేబుల్ స్పూన్స్, వాము పావు టీ స్పూన్,కార్న్ ఫ్లోర్ హాఫ్ కప్, సాల్ట్ తగినంత
స్టెఫిన్గ్ కి కావలసిన పదార్ధాలు: తొక్కు తీసి ఉడకపెట్టిన ఆలూ 1, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన 3 పచ్చి మిరపకాయలు,సన్నగా తరిగిన అల్లం చిన్న ముక్క, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు 4,కచ్చా పచ్చా గా గ్రైండ్ చేసిన ఒక కప్ ఫ్రోజెన్ గ్రీన్ పీస్, ఒక స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ జీల కర్ర, కారం పావు స్పూన్, తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్,హాఫ్ టీస్ స్పూన్ గరంమసాలా,ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్,ఉప్పు రుచికి సరిపడ., హాఫ్ చెక్క నిమ్మకాయ,డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్.
తయారు చేయు విధానం:ముందుగా ఒక పాన్ లో, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో జీల కర్ర అర నిమిషం వేగాక, తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ,అల్లం, వెల్లుల్లి వేసి కమ్మని వాసం వచ్చేంత వరకు 2 నిమిషాలు వేయించండి.ఆ తర్వాత గ్రైండ్ చేసిన గ్రీన్ పీస్, ఉడికన ఆలు వేసి, ఇంకో 4 నిముషాలు మూత పెట్టి మగ్గనివ్వండి.ఇప్పుడు ధనియ పొడి, గరంమసాలా, కారం, కొత్తి మీరా,రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండి, చల్లార నివ్వండి కొంచెం సేపు.
గోధుమ పిండిలో, రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, వాము,తగినంత ఉప్పు వేసి కలిపి, కొంచెం నీరు వేసి చపాతి పిండి లా కలుపుకుని 15 నిమిషాలు మూతపెట్టి ఉంచండి.
ఈ లోపల ఒక కప్ లో 4 టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ కి 6 టేబుల్ స్పూన్ ల ఆయిల్ వేసి బాగా స్మూత్ పేస్ట్ లాగ కలిపిపెట్టుకోండి.
ఇప్పుడు కలిపిన పిండి ని ఇంకొక 2 నిమిషాలు మర్దించి,పిండి ని ఈక్వల్గా డివైడ్ చేసి కనీసం ఐదు సన్నగా చపాతీలా వత్తండి. (చపాతిల వత్తేటప్పుడు, డెస్టిన్గ్కి కార్న్ ఫ్లోర్ ని వాడితే
పఫ్ బాగా వస్తుంది ఊడకుండా)వత్తిన చపాతీలు ఒక్కొక్కటి తీసుకుంటూ, కలిపిన కార్న్ ఫ్లోర్ ఆయిల్ పేస్ట్ ని స్పూన్ తో చపాతి పై భాగం మొత్తం స్ప్రెడ్ చేసి,పైన కొంచెం కార్న్ ఫ్లోర్ చల్లండి,ఇలా అన్ని చపాతిల పైన స్ప్రెడ్ చేస్తూ, ఒకదాని పైన ఒకటి పేరచండి దొంతర లాగ . చివరి చపాతి పైన కూడా కార్న్ఫ్లోర్ పేస్ట్ రాసి, కార్న్ఫ్లోర్ చల్లాక, లోపలి వైపుకు చుట్టుకుంటూ, ఒక పొడవాటి రోల్ లాగ చెయ్యండి. ఈ రోల్ ని సమానంగ ఒక ఆరు లేదా ఏడూ ముక్కలు చేసి, ప్రతి చిన్న ముక్క ని ఉండ లాగ చుట్టేసి చపాతి లాగ పల్చగా వత్తండి.దాంట్లో తయారు చేసి పెట్టుకున్న స్టెఫిన్గ్ పెట్టి అంచులు నాలుగు వైపులా నీరు రాసి కజ్జికాయ ఆకారం లో కానీ ట్రయాంగల్ ఆకారం లో కానీ చేసి పెట్టుకోండి.
ఇప్పుడు ఒక మూకుడులో ఆయిల్ వేడి చేసి, దాంట్లో వీటిని డీప్ ఫ్రై చెయ్యండి.ఈ పఫ్ లో, బయట దొరికే పఫ్స్ లో అత్యధిక మోతాదులో వేసే బట్టర్ ఉండదు.గోధుమ పిండి తో చేసింది కాబట్టి పిల్లల ఆరోగ్యానికి మంచిది,ఈవెనింగ్ స్నాక్ గా ఇష్టంగా కూడా తింటారు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..