ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు
- July 23, 2021
ఆయిల్ ఇండియా లిమిటెడ్-జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 120 ఇందులో ఎస్సీలకు 8,ఎస్టీలకు 14, ఓబీసీలకు 32, ఈడబ్ల్యూఎస్‌లకు 12, జనరల్ అభ్యర్ధులకు 54 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత: కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/ పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆరు నెలల డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్ తెలిసి ఉండాలి.
వయసు: ఆగస్టు 15 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 30 ఉళ్ల మధ్య వయసుండాలి. పరీక్ష ఎలా ఉంటుంది.. క్వశ్చన్ పేపర్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, ఆయిల్ ఇండియా సమాచారానికి సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. రెండో సెక్షన్‌లో రీజనింగ్, అర్థమెటిక్/ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంశాలనుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. మూడో సెక్షన్‌లో డొమైన్/టెక్నికల్ నాలెడ్జ్ అంశాల నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షను ఇంగ్లీష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం నెలకు: రూ.26,600 దరఖాస్తు ఫీజు: రూ.200 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 8 వెబ్‌సైట్: https://www.oilindia.com/
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







