భారత్ కరోనా అప్డేట్
- July 27, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గినట్టే కనిపించినా.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే, తాజా బులెటిన్ ప్రకారం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 29,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 415 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 42,363 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.14 కోట్లకు పెరిగింది.. ఇందులో 3,06,21,469 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు.. మరోవైపు మహమ్మారి బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,21,382కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,98,100 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 44,19,12,395 డోసుల వ్యాక్సిన్ వేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.
తాజా వార్తలు
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!









