ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.!
- July 28, 2021
ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఐబీపీఎస్ ద్వారా 61 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. మేనేజర్ (స్కేల్-1), స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు వున్నాయి. ఆగస్టు 5 దరఖాస్తులకు చివరి తేది. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ లో స్పెషలైజేషన్ ఉండాలి.
40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. వయసు 2021 జూన్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ టెస్ట్ ని నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.700 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500). అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.apcob.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









