రెండో పెళ్లి చేసుకోనున్న హీరో సుమంత్.!
- July 28, 2021
అక్కినేని కుటుంబానికి చెందిన నటుడు సుమంత్ కుమార్ ఒక దశాబ్దానికి పైగా ఒంటరిగా ఉన్నారు. తాజాగా ఆయన మళ్ళీ పెళ్ళికి రెడీ అయ్యాడు. 2004లో కీర్తి రెడ్డిని మొదటి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ జంట 2006 లో విడిపోయారు. ఆ తరువాత సుమంత్ తెలుగు సినిమాలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో బిజీగా మారిన ఆయన పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సుమంత్ నటించిన "అనగనగా ఒక రౌడీ" అనే చిత్రం చిత్రీకరణతో ఉంది. ఈ క్రమంలో అతి త్వరలోనే సుమంత్ మరోసారి పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. పవిత్ర అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. పెళ్లికు ముహూర్తం కూడా ఖరారయ్యింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. సుమంత్, పవిత్రల వివాహానికి మొత్తం అక్కినేని కుటుంబం హాజరుకానుంది. మరోవైపు కీర్తి రెడ్డి కూడా రెండవ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







