రాఘవపూడి దర్శకత్వంలో 'లెఫ్టినెంట్ రామ్' గా దుల్కర్
- July 28, 2021
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'లెఫ్టినెంట్ రామ్' అనే టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో 'లెఫ్టినెంట్ రామ్'గా దుల్కర్ సల్మాన్ జీవన విధానాన్ని, సరిహద్దులో ఒక అమ్మాయి కోసం తపన పడే లెఫ్టినెంట్ రామ్ ను చూపిస్తుంది. విజువల్స్, దుల్కర్ లుక్, బిజిఎం చాలా బాగున్నాయి. మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో దుల్కర్ సల్మాన్ చేతిలో కాగితపు ముక్కతో సైకిల్‌పై వెనుకకు కూర్చుని కనిపిస్తాడు. సైనికులు ఆయనను అనుసరిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ఇక దుల్కర్ సల్మాన్ మణిరత్నంతో కలిసి తమిళ సినిమా 'ఓకే కన్మణితో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇందులో నిత్యా మీనన్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. మలయాళంలో మాత్రమే కాకుండా దాదాపు ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో మహానటి, ఉస్తాద్ హోటల్, చార్లీ, సోలో, కార్వాన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'మహానటి'లో కనిపించాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అతని రెండవ తెలుగు చిత్రం. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కిట్టిలో కురుప్, సెల్యూట్ వంటి పలు చిత్రాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









