కోవిడ్ టెస్ట్ ఫేక్ రిపోర్ట్ కేసులో దోషికి ఏడాది జైలు శిక్ష
- July 29, 2021
బహ్రెయిన్: కోవిడ్ టెస్ట్ నకిలీ రిపోర్ట్ అధికారులను బురిడి కొట్టించాలనుకున్న ఓ వ్యాపారి ప్లాన్ బెడిసికొట్టింది. ఫోర్జరీ రిపోర్ట్ గుట్టు బయటపడటమే కాకుండా అతని అతి తెలివికి ఏడాది జైలు శిక్ష పడింది.ఓ స్వీట్ వ్యాపారి గత మార్చిలో కింగ్ ఫహేద్ క్యాజ్ వే ద్వారా బహ్రెయిన్ నుంచి సౌదీ చేరుకునేందుకు బయల్దేరాడు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా తీసుకున్న కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. కానీ, వ్యాపారి తన టెస్ట్ రిపోర్ట్ సమర్పించకుండా తన స్నేహితుడి రిపోర్ట్ ను ఫోర్జరీ చేసి తన పేరు మీదకు మార్చుకున్నాడు. అదే రిపోర్టును అధికారులకు సమర్పించాడు. అయితే..క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటంతో ఒరిజినల్ రిపోర్ట్ బయటపడింది. దీంతో బహ్రెయిన్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి దిగువ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు వ్యాపారికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. అయితే..ఆ శిక్షను బహ్రెయిన్ అప్పీల్స్ కోర్టు ఏడాదికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









