కరోనా మార్గదర్శకాలు పొడిగింపు
- July 29, 2021
న్యూ ఢిల్లీ: కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును మరోసారి పొడిగించింది.వచ్చే నెల 31(ఆగస్టు)వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.మరోవైపు ఇప్పటికీ కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక, కరోనా కేసులు తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది.కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటం పై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.వరుసగా పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ఇక, కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపుపై ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది కేంద్రం.కరోనా సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉండాలని పేర్కొంది. కాగా, తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన నిబంధనలు విధించాలన్నారు.ఆయా ప్రాంతాల్లో వైరస్ను కట్టడిచేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అజయ్ భల్లా సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









