కోవిడ్ తో చనిపోతే..రూ.లక్ష పరిహారం
- July 29, 2021
కువైట్: కువైట్ లోని ఇండియన్ ఎంబసీ కరోనా సంక్షోభ సమయంలో ప్రవాసులను ఆదుకునే దిశగా కీలక ప్రకటన చేసింది.కువైట్లో కోవిడ్ తో చనిపోయిన భారత ప్రవాసులకు పరిహారం రూపంలో రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది.కేవలం అల్పాదాయ వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఎంబసీ ఆధ్వర్యంలోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూపు(ICSG) సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.ఈ మేరకు బుధవారం(జులై 28, బుధవారం) జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జి ప్రకటించారు.120KD కంటే తక్కువ సాలరీ గల ఏ భారత ప్రవాసుడైన మహమ్మారితో చనిపోతే వారు ఈ పరిహారం పొందెందుకు అర్హులని రాయబారి వెల్లడించారు.
కాగా,ఇప్పటివరకు కువైట్లో 540 మంది భారతీయులు కరోనాతో చనిపోయారు.వీరిలో వంద మంది కంటే ఎక్కువ 120 కేడీల కంటే తక్కువ జీతం గలవారేనని సమాచారం.రాయబారి సిబి జార్జి మాట్లాడుతూ..లక్ష రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదని తెలుసు,కానీ మృతుల కుటుంబానికి ఇది ఏదో ఒక రకంగా సహాయపడుతుందని అన్నారు.అర్హులైన వారిని ఎంబసీ అధికారులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ఈ నగదు అందజేయస్తారని అంబాసిడర్ తెలిపారు.
తాజా వార్తలు
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!









