కేరళలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్
- July 29, 2021
తిరువనంతపురం: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1 తేదీల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు వివరించింది.కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్షల విధింపు పై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేరళలో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ సర్కారు లాక్డౌన్ విధించాలని ఈ రోజు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు,కేరళలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది.జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల వైద్య బృందం ఆ రాష్ట్రానికి త్వరలోనే చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనాపై పోరులో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయపడనుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







